విమానంలో మాజీ మంత్రికి దక్కిన అరుదైన గౌరవం.
చెన్నై నుంచి గోవాకు వెళ్తున్న గోవా మాజీ మంత్రి దీపక్ ధవళికర్ కి అరుదైన గౌరవం లభించింది. ఊహించని విధంగా తాను ప్రయాణించే విమానంలోనే కూతురు గౌరీ ధవళికర్ పైలట్ గా ఉన్నారు. అది తెలుసుకున్న కుమార్తె గౌరీ ధవళికర్ వెంటనే ఆమె సాధారణ ప్రయాణికులను స్వాగతిస్తున్నట్లుగా మాట్లాడుతూ.. వారిలో తండ్రి కూడా ఉన్నారంటూ పరిచయం చేయడమే గాక ఈ విమాన జర్నీ నాకు చాలా ప్రత్యేకమైనది అని ఉద్వేగంగా పేర్కొంది. “ఈ రోజు నేను నా తండ్రితో కలిసి ఈ విమానంలో ప్రయాణిస్తున్నా. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆయన్ను గోవాలోని మా ఇంటికి పైలట్ గా నేను తీసుకువెళ్తున్నా. నా తండ్రి ఇప్పుడు ప్రయాణికుడు అని ఆనందంగా అనౌన్స్ మెంట్ ఇచ్చారు.” పైలట్ గౌరీ ధవళికర్. ఇలా ఆమె మాటలు పూర్తి అయ్యేలోపే.. ప్రయాణికులు హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టి ప్రశంసించారు ఆ తండ్రి కూతుళ్లని. అంతేగాదు ఆ విమానంలోని ప్రయాణికులందరి సమక్షంలోనే కృతజ్ఞతలు తెలిపింది. నా కలలన్నింటిన నిజంచేసేలా ఈ మొత్తం ప్రపంచాన్ని ఇచ్చినందుకు నా తండ్రికి కృతజ్ఞతలు అని చాలా భావోద్వేగంగా చెప్పారు. గోవాలోని ప్రియోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దీపక్ ధవలికర్ 2012 నుంచి 2016 వరకు మనోహర్ పారికర్ నేతృత్వంలోని అధికార గోవా ప్రభుత్వంలో మంత్రి పనిచేశారు. 1961లో పోర్చుగీస్ వలస పాలన ముగిసిన తర్వాత గోవాలో తొలి పాలక పార్టీ అయిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)కి ఆయన ప్రస్తుత చీఫ్. ఇక ఆయన సోదరుడు సుదిన్ ధవలికర్ మారక్రమ్ ఆ నియోజకవర్గం నుంచే ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు, అలాగే గోవా మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

