Home Page SliderNational

తన పెళ్లికి ప్రధానిని ఆహ్వానించిన ప్రముఖ నటి

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ జూలై 2న నికోలయ్ సచ్‌దేవ్‌ను థాయ్‌లాండ్ వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పలువురు సినీ,రాజకీయ ప్రముఖలను స్వయంగా కలిసి  చెన్నైలో జరగబోయే తన వివాహ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వరలక్ష్మి దంపతులు శరత్ కుమార్,రాధికాలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసినట్లు తెలుస్తోంది. కాగా వరలక్ష్మి దంపతులు తమ వివాహ రిసెప్షన్ కార్డును ప్రధానికి అందించి ఆయనను రిసెప్షన్‌కు ఆహ్వానించారు. అయితే ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రధాని మోదీ తమకు సమయం ఇచ్చినందుకు వరలక్ష్మి ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోదీతో దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.