అధ్వాన్నంగా తయారైన రాజధాని నగరం
దేశ రాజధాని నగరం దిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పరిస్థితులు నానాటికీ తీసికట్టు అవుతున్నాయి. ఒక పక్క వాయు కాలుష్యంతో సతమతమవుతున్న దిల్లీ ప్రజలు నీటి కాలుష్యంతో కూడా విలవిల్లాడుతున్నారు. యమునానది తెల్లటి నురుగులతో విషం కక్కుతోంది. ఏక్యూఐ 400 పాయింట్ల పైన పెరిగిపోయి ప్రజలకు ఊపిరి తీయడానికే కష్టంగా మారుతోంది. ఇప్పటికే ప్రజలను మాస్కులు వేసుకుని తిరగాలని ప్రభుత్వం సూచించింది. మొత్తంగా దిల్లీ ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది.