క్రికెట్ ఆడుతూ ఆటగాడు మృతి
అప్పటి వరకూ తమతో మైదానంలో కలిసి ఆడుతున్న క్రికెటర్ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం మిగతా ప్లేయర్లలో వణుకు పుట్టించింది. పూణెలోని ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ ఓపెనర్‌గా ఆడుతున్నాడు. కాసేపటికే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పి, డగౌట్ వైపు వెళుతుండగా, కాస్త దూరంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉండడంతో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. దీనితో తోటి క్రికెటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, చాలా యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉండేవాడని తెలిపారు. ఇదే మైదానంలో ఇటీవల సెప్టెంబర్‌లో హబీబ్ షేక్ అనే క్రికెటర్ కూడా ఇలాగే ఆడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీనితో గుండెపోట్లు ఎవరికి ఎప్పుడు వస్తాయో చెప్పడం కష్టంగా మారింది.