స్లీపర్ సెల్స్‌తో భారీ ఉగ్రదాడికి ప్లాన్..
స్లీపర్ సెల్స్‌తో భారీ ఉగ్రదాడికి ప్లాన్.. భారత్‌లో స్లీపర్ సెల్స్ సహాయంతో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు ఇంటిలిజెన్స్ అధికారులు కనిపెట్టారు. ఈ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఈ ఏడాది జనవరి నుండి మార్చి వరకూ ఢిల్లీ పోలీసులు, ఇంటిలిజెన్స్ అధికారులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ కుట్రను కనిపెట్టారు. ఇద్దరు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లను అరెస్టు చేసి, కీలక సమాచారాన్ని సేకరించారు. వారిద్దరూ నేపాల్‌కు చెందిన అన్సారీ, ఝార్ఖండ్‌కు చెందిన అజమ్ అని అధికారులు పేర్కొన్నారు. దేశంలోని ఐఎస్‌ఐ స్లీపర్ సెల్స్‌తో పహల్గామ్ అటాక్‌కు ముందే భారీ స్థాయిలో ఈ ఉగ్రదాడులకు ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు.