బ్రిటన్ హోం సెక్రటరీగా భారత సంతతి వ్యక్తి
బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు తీసుకోనున్న లిజ్ ట్రస్ తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. అందులో హోం సెక్రటరీగా భారత సంతతి మహిళ సుయెల్లా బ్రవర్‌మన్(42) అవకాశమిచ్చారు. లిజ్ ట్రస్ గెలిచిన తర్వాత ఆ పదవిలో ఉన్న ప్రీతి పటేల్ స్థానంలో సుయెల్లా బ్రవర్‌మన్‌ను ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.

బ్రవర్‌మన్ ఆగ్నేయ ఇంగ్లండ్ లోని ఫారెహామ్‌కు కన్జర్వేటివ్ పార్టీ తరుపున 2015లో ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకు ముందు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాయాంలో అటార్నీ జనరల్ గా కూడా పనిచేశారు. సుయెల్లా బ్రవర్‌మాన్ 1980లో జన్మించారు. ఆమె తల్లి ఉమా తమిళనాడుకు చెందిన హిందూ కాగా.. తండ్రి క్రిస్టీ ఫెర్నాండెస్. తండ్రి 1960లో కెన్యా నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లగా.. తల్లి ఉమా మారిషస్ నుంచి బ్రిటన్ కు వలస వెళ్లారు. బ్రవర్‌మన్ 2018లో రేల్ బ్రమర్ మాన్ ను వివాహం చేసుకున్నారు. ఆమె బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నారు. తాజాగా ఆమె ప్రమాణ స్వీకారం సమయంలో కూడా బౌద్ధ గ్రంథం ” ధమ్మపద”పై ప్రమాణం చేస్తూ బాధ్యతలను స్వీకరించారు.

