అదానీ గ్రూప్‌పై యూఎస్ ఆరోపణల విషయంలో కొత్త ట్విస్ట్
అదానీ గ్రూప్‌పై యూఎస్ కోర్టు ఆరోపణల విషయంలో కొత్త విషయాలు బయటపడ్డాయి. అదానీ గ్రూప్‌కు చెందిన గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై నమోదు అయినట్లు చెప్తున్న డిస్ట్రిక్ట్ కోర్టు కేసులో అసలు తమపై లంచాలకు సంబంధించిన కేసు లేదని వారు వెల్లడి చేశారు. అసలు అలాంటి ఆరోపణలే వారు నమోదు చేయలేదన్నారు. ఫారిన్ కరప్షన్, లంచాలపై భారత్, అమెరికా మీడియా చేస్తున్న ప్రచారం అంతా అబద్దమని, మొత్తం 5 అభియోగాలలో 3 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. వీటిలో సెక్యూరిటీస్ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర వంటి ఆరోపణలే ఉన్నాయని, వాటినుండి తాము ఈజీగా బయటపడతామని పేర్కొన్నారు. అవి కేవలం ఆరోపణలు మాత్రమేనని స్పష్టం చేశారు. నిన్న జరిగిన సమావేశంలో తమ గ్రూప్‌కు విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు అవసరం లేదని, తమ కంపెనీలు నడవడానికి, ఉద్యోగుల జీతాలకు తగిన నిధులున్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.

