ఆ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి నగ్న వీడియో కాల్..
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి వీడియోకాల్ వచ్చింది. గుర్తుతెలియని నంబర్ నుంచి వచ్చిన ఆ వీడియోకాల్ ను ఎమ్మెల్యే రిసీవ్ చేశారు. దీంతో వెంటనే ఫోన్ స్క్రీన్ పై మహిళ నగ్నంగా కనిపించింది. ఆందోళనకు గురైన ఎమ్మెల్యే వెంటనే కాల్ ను కట్ చేశారు. అయితే, తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా అలా వీడియోకాల్ చేశారా? లేక నిజంగానే గుర్తుతెలియని వ్యక్తులే చేసి ఉంటారా? అనే అనుమానం ఎమ్మెల్యేకు కలిగింది. తన ప్రతిష్ఠను దిగజార్చడంతోపాటు బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉంటారనే అనుమానంతో ఆయన వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కు కంప్లైంట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళ ఎవరూ.. ఆ ఫోన్ నంబర్ ఎవరిదని గుర్తించే పనిలో పడ్డారు.