Home Page SliderInternational

బంగ్లా మాజీ ప్రధానిపై హత్యకేసు నమోదు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్యకేసు నమోదయ్యింది. ఆమె ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్నారు. బంగ్లా ప్రధానిగా రాజీనామా చేసిన ఆమెతో పాటు మరో ఆరుగురు మాజీ మంత్రులు, అధికారుల పేర్లు కూడా ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. మొహమ్మద్‌పూర్‌లోని ఓ కిరాణ దుకాణం యజమాని అబుసయ్యద్ హింసాత్మక ఘటనల కారణంగా మరణించారు. రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్ ఆందోళనలో 550 మంది మరణించారు. దీనితో అతని మరణానికి షేక్ హసీనానే కారణమంటూ సయ్యద్ కుటుంబీకులు హసీనాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు ఆమె పార్టీకి చెందిన మరి కొందరిపై కూడా కేసు నమోదయ్యింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఉన్న మహమ్మద్ యూనస్ ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హసీనా దేశం నుండి వెళ్లడంతో మాన్‌స్టర్ వెళ్లిపోయిందంటూ విద్యార్థి సంఘాలతో వ్యాఖ్యానించారు.