కల్తీ పండ్లరసం టెట్రా ప్యాకెట్ల కలకలం
వికారాబాద్ జిల్లా తాండూరులో కల్తీ పండ్లరసం టెట్రా ప్యాకెట్ల తయారీ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు.వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించి ముఠాని అదుపులోకి తీసుకున్నారు.అక్రమంగా తయారు చేసి సరఫరాకు సిద్ధంగా ఉంచిన టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.వీటిని కర్ణాటక నుంచి ఇక్కడకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.తిరిగి ఇక్కడ నుంచి జంటనగరాల్లోని అన్నీ కూల్ డ్రింక్స్ తయారీ సంస్థలకు పంపిణీ చేస్తారు.మోతాదుకు మించి పురుగు మందుల అవక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.మొత్తం 67 టెట్రా ప్యాకెట్లతో పాటు సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

