NationalNews Alert

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాఫ్టర్‌కు తప్పిన ముప్పు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన హెలికాఫ్టర్ రాజస్థాన్‌లోని హనుమాన్ ఘర్ జిల్లా సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా లాండ్ అయ్యింది. దీనికి సాంకేతికలోపమే కారణమని తెలుస్తోంది. ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి అత్యవసరంగా వ్యవసాయక్షేత్రంలో దించారని, హెలికాఫ్టర్‌లో సిబ్బందికి ఏ ప్రమాదం జరగలేదని, సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.  ఉదయం 10 గంటలకు హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ అయిందని , భద్రతా అంశాలను ధృవీకరించుకుని తిరిగి బయలుదేరిన హెలికాఫ్టర్ ప్రయాగ్ రాజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపారు.

 హెలికాఫ్టర్‌లోని వార్నింగ్ లైట్ బ్లింక్ అవడంతో ఫైలట్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నారని, సంగారియా పోలీస్ స్టేషన్‌కు చెందిన హౌస్ ఆఫీసర్ హనుమానారామ్ విష్ణోయ్ తెలియజేసారు.