HealthHome Page SliderInternational

వైద్యరంగంలో అద్భుతం-ఐదువేల కిలోమీటర్ల దూరం నుండి ఆపరేషన్

చైనా వైద్యరంగంలో అద్భుతం చేసింది. చైనాలోని లువో క్విన్‌కాన్ అనే ఒక డాక్టర్ తన పేషెంట్‌కు ఐదువేల కిలోమీటర్ల దూరం నుండి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స ద్వారా రోగి ఊపిరితిత్తుల్లో కణితిని తొలగించారు. షాంఘైలోని తన ఆసుపత్రి నుండి ఐదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్గర్‌ అనే పేషంట్‌కు 5జీ సర్జికల్ రోబోట్ సిస్టమ్ ద్వారా ఆపరేషన్ నిర్వహించారు. ఒక గంట పాటు మెషిన్‌ను ఆపరేట్ చేస్తూ ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. దీనితో వైద్యరంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టుకున్నట్లయ్యింది. రోగి ఎంత దూరంలో ఉన్నా వైద్యులు సర్జరీని కూడా దూర పద్దతిలో ఈ 5జీ సర్జికల్ రోబో ద్వారా నిర్వహించవచ్చని రుజువయ్యింది.