Breaking NewscrimeHome Page SliderTelangana

మైన‌ర్ పై లైంగిక దాడి చేయ‌బోయి

సినీ ఫ‌క్కీ త‌ర‌హాలో లైంగిక దాడికి పాల్ప‌డ‌బోయి పోలీసులుకు చిక్కిన‌ పోకిరీల ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. బీహార్ కి చెందిన 17 ఏళ్ల మైన‌ర్ హైద్రాబాద్ మాదాపూర్ హోట‌ల్‌లో డైలీ వేజ్‌గా ప‌నిచేస్తుంది.స్వ‌రాష్ట్రానికి చెందిన మ‌రో యువ‌కుడితో క‌లిసి ప‌నివేళ ముగిశాక ఆటోలో ఇంటికి బ‌య‌లు దేరింది.ఈ క్ర‌మంలో న‌లుగురు దుండ‌గులు ఆటోని అడ్డగించి.బాలిక ప‌క్క‌న ఇద్ద‌రు, ఆటో డ్రైవ‌ర్ ప‌క్క‌న మ‌రో ఇద్ద‌రు కూర్చొని బాలిక ప‌ట్ల అస‌భ్య‌కరంగా ప్ర‌వ‌ర్తించారు.దీంతో ఆటో డ్రైవ‌ర్ వాళ్ల ఆగ‌డాల‌ను ధైర్యంగా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాడు.అత‌నిపైనా దుండ‌గులు దాడికి పాల్ప‌డ్డారు.అయినా స‌రే మ‌రింత ధైర్యం తెచ్చుకుని వారిని ఆటో నుంచి కిందకు తోసేసి అతి క‌ష్టం మీద బాలిక‌ను ఇంటి వ‌ద్ద‌కు చేర్చారు.అయినా దుర్మార్గులు ఆ బాలిక‌ను ఇంటి కి వెళ్లి మ‌రీ వేధించారు.బాత్రూమ్ లోకి తీసుకెళ్లారు.దీంతో కుటుంబీకులు కాళ్లా వేళ్లా ప‌డ్డారు.అయినా క‌నిక‌రించ‌లేదు. ఇరుగుపొరుగు వారు 100కి ఫోన్ చేయడంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని నిందితుల‌ను అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌కి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్నారు.