మీకు కూల్ డ్రింక్ మ్యాన్ గురించి తెలుసా?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలున్న ఆహరం తీసుకోవాలని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అంతేకాకుండా అనేక రకాల జబ్బుల బారిన పడకుండావుండాలంటే జంక్ ఫుడ్,కూల్ డ్రింక్స్ తీసుకోకపోవటమే మంచిదని చెప్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా 17 ఏళ్లుగా కేవలం కూల్ డ్రింక్ మాత్రమే తీసుకుంటున్నాడు. అయినప్పటికీ అతడు చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. కాగా ఇరాన్‌కు చెందిన ఘోలంరెజాకు 58 ఏళ్లు.అయితే ఈయన గత 17 సంవత్సరాల నుంచి కూల్ డ్రింక్స్ మాత్రమే ఆహరంగా తీసుకుంటూ..అసలు ఘన పదార్థాలు ఆహరంగా తీసుకోవడమే మానేశాడు. పైగా ఇతనికి మనుష్యులు తినే ఆహారం చూస్తే వికారంగా అనిపిస్తుందంట. అందుకే గత 17 ఏళ్లుగా కేవలం శీతల పానీయాలు (వారానికి ఒకరోజు కొద్దిగా నీరు,టీ)మాత్రమే త్రాగుతూ..జీవనం సాగిస్తున్నాడు.

అయితే అతను ఇలా ప్రవర్తించడానికి ఓ కారణం ఉంది. అదేంటంటో ఆయన 2006లో ఒకరాత్రి నిద్రపోతుండగా వింత అనుభవం ఎదురైంది. అనుకోకుండా నిద్రలో నుండి లేచి ఉలిక్కి పడ్డారు. ఆ సమయంలో అతనికి గొంతులో ఏదో వెంట్రుకల కట్ట ఇరుక్కన భావన కలిగింది. దాంతో ఆయన దాన్ని తన గొంతులో నుంచి తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ..అది మాత్రం సాధ్యపడలేదు. కాగా దీని విషయమై ఆయన చాలామంది వైద్యులను సంప్రదించగా..అతనిని పరీక్షించిన వైద్యులు గొంతులో అలాంటిదేమి లేదని స్పష్టం చేశారు.తర్వాత ఆయన మానసిక వైద్యులను కూడా కలిశాడు. కానీ ఎవరు కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపించలేదు. అప్పటి నుంచి ఆయన ఆహారం తినడం పూర్తిగా మానేశాడు. దీంతో ఆయనకు కొంతమేర ఉపశమనం లభించింది. ఇలా ఆహారం బదులు శీతల పానీయాలు తాగడం మొదలు పెట్టిన ఘోలంరెజా రోజుకు 3 పెద్ద బాటిళ్లు ఖాళీ చేస్తున్నాడు. అయితే ఇలా చేయడం వల్ల ఆయన ఇప్పటివరకు 32 కిలోల బరువు తగ్గాడు. కాగా ఈయనకు తరచూ..ఎండోస్కోపీ ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న ఆరోగ్యం సాధారణంగానే ఉండడం విశేషం.