బద్దలైన అగ్నిపర్వతం
ఐస్ ల్యాండ్‌లో అగ్ని పర్వతం బద్దలైంది. దాదాపు 3 కి.మీ.మేర చీలికలు ఏర్పడ్డాయి. దక్షిణ ఐస్ ల్యాండ్‌లో రెగ్జానెస్ ద్వీపకల్పం లో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. లావా ఉప్పొంగి ఆకాశాన్ని ఎర్రబారేలా చేసింది. మండుతూ ప్రవహిస్తున్న లావా ధాటికి సమీప గ్రామాలు ఉడుకెత్తిపోయాయి.వెంటనే భద్రతా దళాలు ఆయా గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా విమాన రాకపోకలు ఎలాంటి ఇబ్బంది లేదని ఐస్ ల్యాండ్ అధికారులు ప్రకటించారు. కాగా రెగ్జానెస్ ద్వీపకల్పంలోకి ప్రజల రాకపోకలను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఐస్ ల్యాండ్ ప్రభుత్వం ప్రకటించింది.

