భద్రాద్రి అటవి ప్రాంతంలో పేలిన ల్యాండ్‌మైన్
భద్రాద్రి జిల్లాలోని పూసుగుప్ప అటవీ ప్రాంతంలో ల్యాండ్‌మైన్ పేలిన ఘటన కలకలం సృష్టిస్తుంది. పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్ పేలింది. బేస్ క్యాంప్‌కు కిలోమీటర్ దూరంలో ల్యాండ్‌మైన్ పేలడంతో అందరు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ల్యాండ్‌మైన్ పేలుడుతో అప్రమత్తమైన పోలీసులు ఆ ఘటన స్థలాన్ని పరీశీలించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఈ సంఘటనలో ఓ ఆవు మాత్రం పేలుడుకు తీవ్రంగా గాయపడింది. క్యాంప్‌కు ఒక మీటర్ దూరంలోనే ల్యాండ్‌మైన్ అమర్చడంతో ఇంకేమైనా ల్యాండ్‌మైన్‌లు ఉన్నయేమోనని పోలీసులు గాలిస్తున్నారు.

