ఎన్ కౌంటర్‌లో హైదరాబాద్ నేత హతం
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాలు,మావోయిస్టుల మధ్య ఏడాది నుంచి భీకర కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ కాల్పుల్లో ఇప్పటికే 298 మంది మావోలు చనిపోగా …93 మంది భద్రతా బలగాలు మృతి చెందారు.కాగా గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో మరో మావోయిస్టు కీలక నేతను హతమార్చినట్లు భద్రతాబలగాలు గురువారం ప్రకటించాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు పేర్కొన్నాయి. ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇంఛార్జ్‌గా పనిచేసిన చంద్రహాస్‌పై రూ.20 లక్షలకు పైగా రివార్డ్ ఉంది.