Breaking NewscrimeHome Page SliderTelangana

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క ప‌రిణామం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.తెలంగాణ నుంచి త‌ప్పించుకుని వెళ్ళి విదేశాల్లో ఉంటున్న ప్ర‌భాక‌ర్ రావు,శ్ర‌వ‌ణ్ రావుల‌ను హైద్రాబాద్ ర‌ప్పించేందుకు సీఎం రేవంత్ స‌ర్కార్ గ‌త కొద్ది నెల‌ల నుంచి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది.దీనికి సంబంధించి క‌ద‌లిక వ‌చ్చింది.హైద్రాబాద్ పోలీసులు ఇచ్చిన ఆధారాల‌తో సీబిఐ సంతృప్తి చెందింది.ఈ మేర‌కు ఇంట‌ర్ పోల్ అధికారుల‌కు ..ఆ ఇద్ద‌రు నిందితుల విష‌యంలో రెడ్ కార్న‌ర్ నోటీసులు జారీ చేసేందుకు సిఫార్సు చేసింది.196 దేశాల్లో ఉన్న భార‌త ఇంట‌ర్ పోల్ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ప్ర‌భాక‌ర్ రావు,శ్ర‌వ‌ణ్ రావులు త‌ప్పించుకోకుండా ఉండేందుకు అన్నీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇంటర్ పోల్‌కి సీబిఐ సిఫార్సు చేసింది.