తమిళనాడులో బయటపడ్డ భారీ కుంభకోణం
తమిళనాడులో భారీ కుంభకోణం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా 318 మంది నకిలీ స్టాంప్ విక్రయదారులు రూ.951.27 కోట్ల పన్ను ఎగవేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తించారు. ఇద్దరు నకిలీ వెండర్లను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన మెట్రో ఎంటర్ప్రైజెస్ యజమాని జయప్రకాష్, బషీర్ అహ్మద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.ఇంకా ఇలాంటి పన్ను వేతల మోసాలు ఎక్కడెక్కడ జరిగాయో అని సీఐడి,సీబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు.ఒక చోటే ఇలా దాదాపు రూ.1000కోట్ల మేర పన్ను ఎగ్గొడితే…ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్టాలిన్ ప్రభుత్వంలో అరాచకాలు ఎలా ఉన్నాయో అని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.వీటన్నింటికి బీజెపి నేతృత్వంలోనే నడుస్తున్నట్లు స్టాలిన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని మండిపడుతున్నారు.