హైదరాబాద్‌లో ఉద్యోగాల పేరిట భారీ మోసం
తెలంగాణా రాజధాని హైదరాబాద్‌ను కొందరు ప్రబుద్ధులు మోసాలకు అడ్డాగా మారుస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇంకో భారీ మోసం హైదరాబాద్ మహనగరంలో వెలుగు చూసింది. జాగృతి కన్సల్టెన్సీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.24కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.ఈ సంస్థ నిరుద్యోగులు ఒక్కోక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసింది.దీంతో బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.కాగా వారు జాగృతి సంస్థ తమను ఉద్యోగాల పేరుతో మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో వారంతా జాగృతి సంస్థ డైరెక్టర్ జగదీష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

