అగ్నిపర్వతం భారీ విస్పోటనం.. కిలోమీటర్ల మేర ఎగిరిపడ్డ లావా
ఇండోనేషియాలోని ఉత్తర మలుకు ప్రావిన్స్‌లో మౌంట్ ఇబు అగ్నిపర్వతంలో భారీ విస్పోటనాలు చోటు చేసుకుంటున్నాయి. జనవరి మొదటి వారం నుండి ఇప్పటివరకూ వెయ్యికి పైగా విస్ఫోటనాలు జరిగాయని అధికారులు చెప్తున్నారు. తాజాగా నిన్న(ఆదివారం) జరిగిన విస్ఫోటనం కారణంగా ఒకటిన్నర కిలోమీటర్ల మేర గాలిలోకి లావా ఎగసి, బూడిద ఎగిరిపడింది. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని ఆరు గ్రామాలను ఖాళీ చేయించారు. దాదాపు 3 వేల మంది గ్రామస్థులు ఆ ప్రాంతాలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్నారు.