ఆ దేశాలను కుదిపేసిన భారీ భూకంపం..
భారీ భూకంపం థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలను కుదిపేసింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాంక్‌లో 7.3 తీవ్రతతో, మయన్మార్‌లో 6.4 తీవ్రతతో ఒకసారి పావుగంట అనంతరం 7.7 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఆయా దేశాలలో పలు భవనాలు ఊగిసలాడాయి. మయన్మార్‌లోనే భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మనీ సంస్థ పేర్కొంది. మయన్మార్‌లోని ఐకానిక్ ఇర్రావాడి నదిపై ఉన్న అవా బ్రిడ్జ్ కుప్పకూలినట్లు సమాచారం. భూకంపాల ప్రభావం ఎంతగా ఉందంటే, దాదాపు 900 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకాక్‌ను కూడా ప్రకంపనలు కుదిపేశాయి, థాయ్ రాజధానిలోని అనేక ఎత్తైన భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ప్రకంపనల కారణంగా ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. చెరువుల నుండి నీరు ఉప్పొంగింది.


 
							 
							