రేవంత్‌ని కలిసిన ట్రైనీ ఐపిఎస్‌ల బృందం
శిక్షణ పూర్తి చేసుకున్న తెలంగాణా క్యాడర్ ఐపిఎస్ బృందం సీఎం రేవంత్ రెడ్డిని జూబిలీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 2023-24 బ్యాచ్‌కి చెందిన ఈ యువ ఐపిఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకుని తెలంగాణ పరిస్థితులపై గత కొంత కాలంగా అధ్యయం చేస్తున్నారు. శిక్షణానంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలో వీరంతా సీఎంని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ… దేశ శాంతి భద్రతల పరిరక్షణలో యువ ఐపిఎస్‌ల పాత్ర అనిర్వచనీయమన్నారు.సీనియర్ల సలహాలు,సూచనలు తీసుకుని పటిష్టమైన భారత్ నిర్మాణంలో యువ ఐపిఎస్‌లంతా భాస్వాములు కావాలని పిలుపునిచ్చారు.