సిల్కీ హెయిర్‌కి చక్కటి ఉపాయం
ఏమాత్రం ఖర్చు లేకుండా చక్కటి ఉపాయంతో పట్టు లాంటి సిల్కీ హెయిర్‌ను సొంతం చేసుకోవచ్చంటున్నారు సౌందర్యనిపుణులు. సులువైన ఇంటి చిట్కాలలో బియ్యం కడిగిన నీరు బాగా ఉపయోగపడుతుంది. తలస్నానం పూర్తయ్యాక బియ్యం నీటిని తలకు పట్టించి, కాసేపు ఉంచుకోవాలని అనంతరం తలస్నానం చేస్తే జుట్టు పొడిబారే సమస్య నుండి బయటపడుతుంది. బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టి దానిని తలస్నానం కోసం ఉపయోగించవచ్చు. గంజి నీరు కూడా దీనికి బాగా పనిచేస్తుంది. చుండ్రు, జిడ్డు, దురదల నుండి బియ్యం నీటిలో అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కాపాడతాయి. బియ్యం నీటిలోని పొటాషియం, అయోడిన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్ ఉంటాయి. ఇవన్నీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ నీటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మం కూడా మెరుస్తుంది. మొటిమల నివారణకు కూడా బియ్యపు నీటిని వాడవచ్చు.

