బన్నీ మామకు ఘోర అవమానం
సినీ హీరో అల్లు అర్జున్ మామ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపాదాస్ మున్షీని కలిసేందుకు గాంధీభవన్‌కు వెళ్లిన చంద్రశేఖర్‌ని కనీసం పలుకరించకుండానే బయట నుంచి బయటకు పంపేశారు.దీంతో ఆయన చాల సేపు వేచి ఉన్నాక అవమాన భారంతో అక్కడ నుంచి వెనుదిరగక తప్పలేదు. అల్లుడు అరెస్ట్‌పై పార్టీ పెద్దలతో మాట్లాడదామని వస్తే ఇలా అవమానకర రీతిలో ప్రవర్తించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై కోపంతో కారులో ఎక్కి వెళ్లి పోయారు.