రాజన్న కోడెలను అమ్మేసుకున్న మంత్రి అనుచరుడు
వేములవాడ రాజన్న అలయానికి సమర్పించిన కోడెలను కాంగ్రెస్ మంత్రులు ,వాళ్ల అనుచరులు అమ్మేసుకున్నారని మాజీ మంత్రి కేటిఆర్ ఆరోపించారు. ఇటీవల ఆలయ సందర్శనకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సైతం ఓ జంట కోడెలను కానుకగా సమర్పించారు.రేవంత్ సహా చాలా మంది ఆలయానికి మొక్కుబడులుగా కోడెలను సమర్పించారు.అయితే వాటిని నిబంధనలకు విరుద్దంగా మంత్రి కొండా సురేఖ ప్రధాన అనుచరునికి కట్టబెట్టారని కేటిఆర్ ఆరోపించారు.మొత్తం ఆలయంలో 60 కోడెలు ఉండగా వీటిలో 49ని అక్రమంగా విక్రయించారని, కాంగ్రెసోళ్ల ఎప్పటికీ తమ దొంగబుద్ది పోనిచ్చుకోరా అంటూ సోషల్ మీడియాలో తన ఖాతాల ద్వారా కేటిఆర్ తూర్పారబట్టారు.