NationalNews Alert

వైష్ణోదేవి ఆలయాన్ని చుట్టుముట్టిన వరద- ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్

ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా  ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో  భారీ వరదలు సంభవించాయి. డెహ్రాడూన్‌లోని రాయ్‌పూర్ బ్లాక్‌లో సంభవించిన క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వైష్ణోదేవి గుహను వరద చుట్టుముట్టింది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తపకేశ్వర్ ఆలయం వద్ద భారీ వరద సంభవించి, తమసానది భయంకరంగా ప్రవహిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. మాతా వైష్ణోదేవి గుహ యోగా మందిరం, తపకేశ్వర్ మహదేవ్ ఆలయం వైపు వెళ్లే మార్గం కొట్టుకొనిపోయింది. రాయ్ పూర్ బ్లాక్‌లోని సర్ఖేత్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా స్థానికులు తెలియజేసారు. దీనితో సమాచారం తెలిసిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం వారు సంఘటనా స్థలానికి చేరుకుని, ముంపు గ్రామాల ప్రజలను రక్షించారు.