Home Page SliderInternationalNews Alert

పక్షుల గుంపు దాడి..ఘోర విమాన ప్రమాదం

కజకిస్తాన్‌లో అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం బాకు అనే ప్రాంతం నుండి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా మధ్యలో విమానాన్ని మధ్యలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని ప్రయత్నిస్తుండగా, హఠాత్తుగా పక్షుల గుంపు విమానాన్ని ఢీకొట్టింది. దీనితో ఇంజన్‌లో సాంకేతిక సమస్య ఎదురై విమానం కుప్పకూలిందని చెప్తున్నారు. ఈ ఘటనలో ఫ్లైట్‌లో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 42 మంది మృతి చెందారు.