Home Page SliderNational

దీనికి ఆలస్యం చేస్తే 5వేల రూపాయల ఫైన్ కట్టాల్సిందే

ఈ సంవత్సరానికి ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారా ఇప్పటి వరకూ చేయకుంటే త్వరపడండి. ఎందుకంటే 2022-23 సంవత్సరానికి జూలై 31 లోపు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. లేదంటే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం ఐటీఆర్ ఆలస్యమైతే ఆలస్యరుసుము 5 వేల రూపాయలు చెల్లించాలి. దీనితో పాటు వడ్డీ కూడా కట్టవలసి ఉంటుంది. ఈ వడ్డీ పన్ను బకాయిపై 1శాతం ఉంటుంది. దీనినుంచి తప్పించుకోవాలంటే గడువులోపల ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.