Telangana

తల్లిదండ్రులపై ప్రేమను వినూత్నంగా చాటుకున్న రైతు

చింతలూరు గ్రామంలోని రైతు చిన్ని కృష్ణుడు (నాగుల గంగారాం) అమ్మానాన్నలపై ప్రేమను సరికొత్త పద్దతిలో చాటుకున్నాడు. తనకు ఉన్న ఎకరం పొలంలో తల్లిదండ్రులైన నాగుల ముత్తెన్న, భూదేవి చిత్రాలు మూడురకాల వరివంగడాలతో చిత్రాలుగా వేసి వరిపంటను సాగు చేస్తున్నారు. ఈ రకంగా సాగు చేయడం చాలా అభినందనీయమని వండర్ బుక్ ఆఫ్ రికార్డు చీఫ్ కోఆర్డినేటర్ నరేందర్ గౌడ్ అన్నారు. నరేందర్ గౌడ్, జీనియర్ బుక్ ఆఫ్ రికార్డు తెలంగాణా చీఫ్ కోఆర్డినేటర్ బొమ్మల నరేష్ కుమార్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వ్యవస్థాపకుడు సింగరపు శివరామకృష్ణలు కలిసి ఆదర్శరైతు కృష్ణుడు సాగుచేసిన వరిపంటను పరిశీలించారు. అనంతరం అతనికి నాలుగు అవార్డులను అందజేసి సత్కరించారు.

ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులకు కూడా తెలియజేస్తామని మాట ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయంతో ఇప్పటి వరకూ 120 రకాల వరివంగడాలను సాగు చేసినట్లు చిన్ని కృష్ణుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుకన్య, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, మండల వ్యవసాయాధికారిణి దేవిక, కొలిప్యాక్ సింగిల్ విండో ఇన్ చార్జి చైర్మన్ నాగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.