పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ యాంకర్..
తెలంగాణలో బెట్టింగ్ యాప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. వీటిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, ఇప్పటికే వాటిని ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రెటీలకు విచారణకు నోటీసులిచ్చారు. నేడు పంజాగుట్ట పోలీసుల ఎదుట ప్రముఖ యాంకర్ శ్యామల హాజరయ్యారు. తనపై నమోదయిన ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని ఆమెకు సూచించింది. ఈ క్రమంలో ఆమె పోలీసు స్టేషన్‌కు హాజరయ్యారు.

