సమంతకు గుడి కట్టిన వీరాభిమాని
ప్రముఖ హీరోయిన్ సమంతను తెలుగు ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉంటారు. కానీ ఒక యువకుని అభిమానం పీక్స్‌కి చేరింది. సమంతకు ఏకంగా గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ సమంతకు వీరాభిమాని. తన ఇంట్లో ఈ గుడి నిర్మాణం మొదలుపెట్టారు. సామ్ బర్తడే నాటికి ఈ గుడి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి (ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు కావడంతో త్వరతగతిన నిర్మాణం పూర్తి చేస్తున్నారు. గతంలో సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు కూడా త్వరగా సమంత కోలుకోవాలంటూ బ్యానర్లు పట్టుకు తిరిగాడు. మొక్కుబడి యాత్ర పేరుతో సమంత ఆరోగ్యం కోసం తిరుపతి, చెన్నై, కడపదర్గా, నాగపట్నం వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ మొక్కుబడి యాత్ర చేశాడు. సినీనటులకు గుడి కట్టడం అంటే మనకు ఖుష్భూ గుర్తొస్తుంది. 1991లో తమిళనాడులో ఖుష్భూకి గుడికట్టారు అభిమానులు. ఇప్పుడు మళ్లీ సమంత కూడా అంతటి క్రేజ్ సంపాదించుకుంది.

