మహా కుంభమేళాకు ప్రత్యేక వెబ్‌పేజీ
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు సిద్ధమవుతోంది. ఈ కుంభమేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు జరగబోతోంది. ఈ ఉత్సవానికి వాతావరణ శాఖ ప్రత్యేక వెబ్ పేజీని రూపొందించింది. ఎందుకంటే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఈ కుంభమేళా జరగనుంది. అక్కడ పలు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోయాయి. కొన్ని చోట్ల మంచు దట్టంగా కురుస్తోంది. కుంభమేళాకు వచ్చే భక్తులు అక్కడి వాతావరణ పరిస్థితులు తెలుసుకునేందుకు ఈ ప్రత్యేక పేజీని రూపొందించామని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు. దీనిద్వారా రోజుకు రెండుసార్లు వాతావరణ సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు. కుంభమేళాకు హాజరయ్యే భక్తుల అవసరాలు, భద్రత కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలిక వసతి కోసం టెంట్లు, టాయిలెట్లు లక్షల సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కుంభమేళాకు సుమారు 40 కోట్ల మంది వస్తారని అంచనాలు వేస్తున్నారు.