ఖేల్ రత్న అవార్డుల పంట
కేంద్ర ప్రభుత్వం ఖేల్ రత్న అవార్డులను గురువారం ప్రకటించింది.పలు క్రీడల్లో ప్రపంచ స్థాయిలో సత్తా చాటి భారత్ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసిన క్రీడా ఆణిముత్యాలకు అవార్డులను ప్రకటించింది.ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేత గుకేష్,ఒలింపిక్ పతక విజేత మనుభాకర్, పారా అధ్లెట్ చాంపియన్ ప్రవీణ్ కుమార్,హకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్‌లను ఈ అవార్డులువ వరించాయి.త్వరలో ఈ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయనున్నారు.అవార్డులు పొందిన నలుగురు క్రీడాకారులను పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందించారు.
Breaking news: ప్రముఖ క్రికెటర్ కు సీఐడీ నోటీసులు