కారు మీద పడిన కంటెయినర్
బెంగళూరు సమీపంలోని నీలమంగళ దగ్గర జాతీయరహదారి 48పై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6గురు దుర్మరణం పాలయ్యారు. శరీర భాగాలు కూడా గుర్తపట్టలేనంత నుజ్జు నుజ్జయ్యాయి.ఇంత ఘోర ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే. బెంగళూరు వైపు వెళ్తున్న కంటెయినర్ అదుపు తప్పి మరో ట్రక్కుని ఢీకొట్టింది.దాంతో అదుపు తప్పిన కంటెయినర్ పక్క రహదారిలో ప్రయాణిస్తున్న కారుపై పడింది.దాంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోయారు.కారు,మృతదేహాలు సహా నుజ్జు నుజ్జయ్యాయి.ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టాలన్నా గంటల సమయం పట్టింది.ఈ ఘటన పట్ల కర్నాటక ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

