crimeHome Page SliderNationalSpiritual

121 మంది మృతికి కారణమైన వ్యక్తికి క్లీన్‌ చిట్

గతేడాది యూపీలోని హాథ్రస్ జిల్లాలో భోలే బాబా ఏర్పాటు చేసిన  సత్సంగ్ కారణంగా జరిగిన తొక్కిసలాట ఘటన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్ తాజాగా ఇచ్చిన నివేదికలో భోలే బాబాకు ఈ ఘటనతో సంబందం లేదంటూ క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. భక్తులు భారీగా లక్షల సంఖ్యలో హాజరు కావడం, భోలే బాబా వెళుతున్న సమయంలో ఆయన పాదధూళి కోసం ఎగబడడంతో ఈ తొక్కిసలాట జరిగిందని, ఊపిరి ఆడకపోవడం వల్లే వారు మరణించారని నివేదికలో తేలింది. అయితే సత్సంగ్ కార్యక్రమ నిర్వాహకులు, పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన జరిగిందని కమిషన్ పేర్కొంది. దీనివల్ల భోలే బాబాను నిందితునిగా చేర్చలేదు.