తల్లి హత్య రహస్యాన్ని బయటపెట్టిన చిన్నారి డ్రాయింగ్
తన తల్లిది ఆత్మహత్య కాదు.. హత్య అని, తన తండ్రే హత్య చేసినట్లుగా నాలుగేళ్ల చిన్నారి గీసిన డ్రాయింగ్ ద్వారా బయటపెట్టింది. ఈ ఘటన యూపీలోని ఝాన్సీలో జరిగింది. సోనాలీ బుధోలియా(27) ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఆమె అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె కుమార్తె దర్శిత (4) ఒక చిత్రాన్ని గీసి, తన తండ్రే, తల్లిని ఉరివేసి చంపేసినట్లు వెల్లడి చేసింది. గతంలో కూడా అనేక సార్లు తల్లిని చంపేస్తానంటూ బెదిరించినట్లు పేర్కొంది. అదనపు కట్నం కోసమే తమ కుమార్తెను హతమార్చారని సోనాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.