పులి నోటిలో పిల్లాడి టీ షర్ట్..
జూలో పెద్దపులిని చూద్దామని బాలుడు వెళ్లాడు. అయితే.. ప్రమాదవశాత్తు బాలుడి టీ షర్ట్ ను పులి నోటితో పట్టుకుని లాగింది. దీంతో ఆ పిల్లోడు కాపాడండి అని కేకలు వేయకుండా.. టీషర్ట్ వదులు.. అమ్మ చూస్తే నన్ను తిడుతుంది. ప్లీజ్ వదులు.. అమ్మ కొడుతుందని పులితో సంభాషిస్తూ పిల్లోడు బతిమాలాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.