భార్య చేత కేసు వేయించాడని…లాయర్ అలా
హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై ఓ లాయర్ ను దారుణంగా హత్యచేశారు.సంతోష్ నగర్ లోని న్యూ మారుతి నగర్ కాలనీకి చెందిన లాయర్ ఇజ్రాయిల్‌ను ఆయన ఇంట్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు.దస్తగిరి భార్య తనని భర్త వేధిస్తున్నాడని లాయర్ ఇజ్రాయెల్‌కి చెప్పి కేసు వేయించింది. దాంతో కోపోద్రిక్తుడైన దస్తగిరి….తనపైనే ఫిర్యాదు చేస్తే నువ్వెలా కేసు వేయించావ్ అంటూ ఘర్షణకు దిగాడు.మాట మాటా పెరిగి తీవ్ర వివాదానికి దారితీసింది.దీంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో లాయర్ ని దారునంగా హతమార్చాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు.

