Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

రమేష్ నాయుడు పై కేసు నమోదు చేయాలి

వాల్మీకి బోయ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తినే మాట్లాడి తాడిపత్రికి చెందిన రమేష్ నాయుడు పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వాల్మీకి బోయ‌ల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయ‌కులు అనంత‌పురం జిల్లా ఎస్పీని క‌లిసి విన్నివించారు. రాష్ట్రంలో 50 లక్షలకు పైగా వాల్మీకి బోయలున్నార‌ని, వారిని తీవ్రంగా అవ‌మానించేలా ర‌మేష్ నాయుడు మాట్లాడార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జాస్వామ్య వాదులంతా ఖండించాల‌ని కోరారు.పార్ల‌మెంట్ స‌భ్యుడిని ఇలా కించ‌ప‌రిచేలా మాట్లాడితే ఇక త‌మ సామాజిక వ‌ర్గంలో ఉన్న వాళ్ళ‌ను అగ్ర‌వ‌ర్ణ‌కుల‌స్థులు ఏవిధంగా చూస్తారో అర్ధం చేసుకోవాల‌ని తెలిపారు. విచారించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎస్పీ వారికి హామీనిచ్చారు.