ఇండియాలో బోణీ కొట్టిన HMPV వైరస్ కేసు
రూపొందించడంలో వెనుక నుంచి ముందుంటారు….ఉపయోగించడంలో ముందు నుంచి ముందుటారు.ఇదీ భారతీయులకు అమెరికన్లు పెట్టిన సామెత.అంటే ఏదైనా వస్తువుని కొత్తగా తయారు చేయాలంటే మన వాళ్లకు ఏళ్లకేళ్ల సమయం పడుతుంది.అదే ఏ దేశంలో తయారైన ఏ వస్తువైనా సరే దాన్ని ఇమ్మీడియెట్‌గా వాడేసే వాళ్లలో ఇండియన్స్ ప్రధమ వరుసలో ఉంటారని అర్ధం.కరోనా వైరస్ చైనాలోని వూహాన్‌లో వెలుగు చూసి అక్కడ కుప్పలు తెప్పలుగా కేసులు నమోదైతే… ఆ తర్వాత వెంటనే దానికి సంబంధించిన కేసులు ఇండియాలోనే నమోదయ్యాయి తప్ప ఉపఖండంలో (పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,శ్రీలంక,బంగ్లాదేశ్,నేపాల్,మాల్దీవులు,మారిషస్) ఎక్కడా నమోదు కాలేదు.ఇప్పుడు కొత్త వైరస్ విషయంలోనూ అదే జరిగింది. ప్రస్తుతం చైనాని కకావికలం చేస్తున్న HMPV వైరస్ కేసు బెంగుళూరులో బోణీ కొట్టింది. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్ టెస్టులో బేబీకి హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (HMPV) పాజిటివ్ అని తేలింది. ఈ కేసు గురించి తమకు సమాచారం అందినట్లు కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.దీంతో సౌత్‌లో కొత్త వైరస్ బోణీ కొట్టినట్లైంది.

