శబరిమలలో తెలుగు భక్తుల బస్సు బోల్తా
శబరిమల యాత్రలో ఉన్న తెలుగువారి బస్సు బోల్తాపడింది.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలవగా,మరో 8 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.పంబకి 15 కిమీ దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.వీరంతా హైద్రాబాద్‌లోని మాదన్నపేట కి చెందిన వారిగా గుర్తించారు.గాయపడిన వారిని కొట్తాయం మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు.మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణిస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Breaking news: భర్తకు ఉరేసి, చంపిన భార్య

