యువతి దారుణ హత్య
మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు.షుమారు 25 ఏళ్ల వయసున్న యువతిని బండరాళ్లతో కొట్టిచంపారు.అనంతరం మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటం కోసం పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.మహిళా మృతదేహమని నిర్దారించుకుని క్లూస్ టీంని రప్పించి ఆధారాలు సేకరించారు.డాగ్ స్క్వాడ్‌ని రంగంలోకి దించారు.మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.