Home Page SliderNational

నడిరోడ్డుపై హద్దు మీరిన అబ్బాయి-ఇద్దరమ్మాయిలతో

ఈమధ్య తరచూ బైకుతో రోడ్లపై యువత చేసే చేష్టలు వార్తలకెక్కుతున్నాయి. తాజాగా ముంబయి రోడ్లపై ఓ యువకుడు ఇద్దరమ్మాయిలతో బైకుపై హద్దుమీరాడు. అసలే బైకుపై ముగ్గురు. మధ్యలో అబ్బాయి, ముందో అమ్మాయి, వెనకో అమ్మాయి. ఇక చెప్పేదేముంది. అబ్బాయిగారి పైత్యం తలకెక్కింది. బైకుపై స్పీడుగా పోతూ రోడ్లపై స్టంట్లు మొదలుపెట్టాడు.

బైకును ఒంటి చక్రంతో నడుపుతూ, ప్రాణాలను లెక్కచేయకుండా విన్యాసాలు చేశారు. ఈ ముగ్గురూ హెల్మెట్లు కూడా ధరించలేదు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వారికి జరిమానాతో సరిపెట్టకుండా, కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు పేర్కొన్నారు. వారు ఎవరో గుర్తు పట్టగలరా అని ట్విటర్‌లో వివరాలు సేకరించే పనిలో పడ్డారు.