Home Page SliderInternational

రక్తమోడిన ‘కేన్స్’ రెడ్ కార్పెట్

‘కేన్స్ రెడ్ కార్పెట్‌’పై నకిలీ రక్తపు మరకలతో హల్‌చల్ చేసిందో అమ్మాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ఈరకంగా నిరసన తెలియజేయాలనుకుంది ఉక్రెయిన్ యుద్ధ నిరసనకారి. కేన్స్‌లో జరుగుతున్న పలైస్ దేశ్ ఫెస్టివల్‌లో భాగంగా ‘అసైడ్’ అనే ఫ్రెంచ్ చిత్రం  ప్రదర్శింపబడుతున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమె పసుపు, నీలిదుస్తులు ధరించి, నకిలీ రక్తపు కాప్సూల్స్‌ను తనపై చిలకరించుకుంది. దీనితో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను వెంటనే ఆప్రదేశం నుండి తప్పించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరక్టర్ థియరీ ఫ్రీమాక్స్, ఈ ఈవెంట్ ప్రారంభంలో ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలిపారు. ఉక్రెయిన్ కవి లెస్యా ఉక్రెయింకా రాసిన ‘హోప్’ అనే కవితను పాడింది ఫ్రెంచ్ నటి కేథరీన్ డెన్యూవ్. ఈ ఉత్సవ ప్రారంభంలో యుద్ధబాధితులకు నివాళులర్పించడం గమనార్హం. గత సంవత్సరం కూడా ఒక ఉక్రెయిన్ మహిళ రష్యా సైనిక దళాలకు వ్యతిరేకంగా బాడీ పెయింట్‌ వేసుకుని ‘స్టాప్ రేపింగ్ అజ్’ అనే సందేశాన్ని ప్రదర్శించింది.