ఈశా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో గొప్ప రిలీఫ్
ఈశా ఫౌండేషన్ అక్రమ నిర్మాణాలకు పాల్పడిందంటూ తమిళనాడులోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు జారీ చేసిన నోటీసులపై ఈ ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో రిలీఫ్ లభించింది. మద్రాసు హైకోర్టు కొట్టివేసిన నోటీసులపై సుప్రీంకోర్టులో సవాలు చేసింది కాలుష్య నియంత్రణ బోర్డు. దీనితో అత్యున్నత న్యాయస్థానం దీనిపై విచారణ జరిపి యోగా, ధ్యాన కేంద్రం అన్నీ పర్యావరణ నిబంధనలు, కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలకు లోబడే నిర్మాణం జరిగిందని వెల్లడించింది. ఈశా ఫౌండేషన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని బోర్డును ఆదేశించింది సుప్రీంకోర్టు.