ఆడతోడు కోసం అడవిని గాలిస్తున్న బెంగాల్ టైగర్
అడవులంటే రాష్ట్రాలు,దేశాల మేర విస్తరించి వాటి సరిహద్దులను సైతం తుడిపేసేలా ఉంటాయి.అలాంటి అభయారణ్యల్లో వన్యమృగ రాజులైన పులులు తమ మనుగడను సాగించడం కోసం సుదీర్ఘ ప్రయాణం చేస్తుంటాయి.ఒక్కోసారి ఒక్కో ఖండం నుంచి మరో ఖండానికి కూడా ప్రయాణం సాగిస్తుంటాయి.అయితే ఇలా ఎందుకు వెళ్తుంటాయో ఎవరికీ తెలిదు.కానీ మన వాళ్లు దీనిపై పరిశోధన చేసి కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఆడ పులులైతే మగపులుల కోసం,మగ పులులైతే ఆడ పులుల కోసం వేల మైళ్ల ప్రయాణాన్ని కూడా అవలీలగా దాటేస్తుంటాయంట. ఈ కోవకు చెందిందే తెలంగాణలో మనుషులపై దాడి చేస్తున్న పులి అని అటవీశాఖాధికారులు ఫైనల్‌గా నిగ్గు తేల్చారు.ఎక్కడ నుంచో వచ్చిన బెంగాల్ టైగర్…తన ఆడ తోడు కోసం గత కొద్ది నెలల నుంచి వేల కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుందని తెలిపారు. దీని కోసం మహారాష్ట్ర,చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతంలో తన పార్ట్నర్ కోసం సుడిగాలి ప్రయాణం సాగిస్తుంది.ఈ క్రమంలో దానికి చిర్రెత్తి ఇద్దరు ఆడవాళ్లు,ఒక పురుషునిపై దాడి చేసి ఇద్దరిని చంపేసింది.అయితే ఇలా దాడులకు పాల్పడుతున్న పెద్దపులికి తన తోడు ఎక్కడో మిస్ అయ్యిందని దాని వల్లే ఇలా ఇరిటేషన్‌కి గురై రాష్ట్రాలు దాటుకుని ప్రయాణం సాగిస్తుందని తెలంగాణ అటవీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తాడ్వాయి,వాజేడు,వెంకటాపురం మీదుగా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అడవుల్లో ప్రవేశించి గోదావరి తీరం వెంబడి ఉన్నట్లు గుర్తించామన్నారు.మొత్తానికి ఈ తరహా మైండ్ సెట్ మనుషులకే అనుకున్నాం..కానీ జంతువులకు కూడా ఉన్నట్లు ఈ ఘటనతో స్పష్టమైంది.

