వీరంగం సృష్టించిన గంజాయి బ్యాచ్
ఏపిలో గంజాయి బ్యాచ్ ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతుంది. తుని-దివాన్ చెరువ మద్యలో ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది.పోలీసులు ఓ వైపు తనిఖీలు చేస్తుండగానే వారి మీద నుంచి కారుదూసుకుపోనిచ్చారు.ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.టోల్ ప్లాజా దగ్గర వాహనాలు ఆపి చెక్ చేస్తుండగా ఆపినట్లే ఆపి తనిఖీలు చేస్తున్న వారిపై దూసుకుపోనిచ్చారు గంజాయి బ్యాచ్.దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు.సినీ ఫక్కీ తరహాలో అక్కడ నుంచి జంప్ అయ్యారు.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.