సింగర్ కల్పన సంచలన వీడియో..
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి రెండ్రోజులు బెడ్ రూంకే పరిమితమైన ఆమెను కాలనీవాసులు పోలీసుల సాయంతో మంగళవారం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం రాత్రి సృహలోకి వచ్చారు. ఈ క్రమంలోనే కల్పన సోషల్ మీడియా వేదికగా సంచలన వీడియో రిలీజ్ చేశారు. అయితే.. ఆ వీడియోలో కల్పన మాట్లాడుతూ.. తన గురించి అదే విధంగా తన భర్త గురించి న్యూస్, సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయని అన్నారు. స్ట్రెస్ వల్లే తను స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నానని తెలిపారు. ఆమెపై వస్తున్న తప్పుడు ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ‘‘నాకు నా భర్త కు ఎలాంటి విభేదాలు లేవు. నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నా భర్త , నా కూతురు.’’ అని వీడియోలో కల్పన పేర్కొన్నారు.

