”రాబిన్ హుడ్” గ్రౌండ్ లో పరుగులు చేస్తాడా?
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఈసారి ఐపీఎల్‌లో కనిపించడం లేదనే సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో డేవిడ్ వార్నర్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. గ్రౌండ్‌కి దూరమైనప్పటికీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌కి మాత్రం దూరం కాలేదు. దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’లో వార్నర్ అతిధి పాత్రలో నటించనున్నాడు.ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలలో ఒకరైన వై రవిశంకర్ తాజాగా వెల్లడించారు. జి వి ప్రకాష్ హీరోగా నటించిన ‘కింగ్‌స్టన్’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో, యాంకర్ తన రాబిన్ హుడ్ సినిమా గురించి నిర్మాతను అప్‌డేట్ అడిగాడు. దీనిపై రవిశంకర్ స్పందిస్తూ, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో అతిధి పాత్ర పోషించాడని వెల్లడించారు.